
JanaSena Gajuwaka Meeting : విశాఖపట్నం కేంద్రంగా ఏపీ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మూడో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చిన పవన్ కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తోంది వైసీపీ. విశాఖ బ్రాండ్‌ను నాశనం చేసేలా పవన్ మాట్లాడుతున్నారంటూ ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే, మూడోరోజు జనసేన వారాహి యాత్రలో భాగంగా ఆదివారం పవన్ కల్యాణ్ గాజువాక బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భారీ ర్యాలీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక చేరుకుని.. అక్కడ మాట్లాడనున్నారు. రెండు రోజుల నుంచి తీవ్రంగా విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్.. ఈ రోజు ఎలా మాట్లాడుతారనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..