News Watch Live: ఎటూ తేలని పొత్తుల పంచాయతీ..! ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేదా?

|

Jul 19, 2023 | 8:41 AM

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు!. మిత్రులు శత్రువులుగా మారొచ్చు!, శత్రువులు మిత్రులు కావొచ్చు!. ఢిల్లీలో ఇదే మాట నొక్కి చెప్పారు పవన్‌ కల్యాణ్‌. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

వైసీపీ వ్యతిరేక ఓటును చీలినివ్వను!. ఇదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన శపథం!. అందుకు తగ్గట్టే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు జనసేన చీఫ్‌. అయితే, తాను అనుకున్నది జరగాలంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయాలన్నది పవన్‌ వాదన. మిత్రపక్షమైన బీజేపీ పెద్దల ముందు ఆల్రెడీ ఈ ప్రతిపాదన పెట్టారు కూడా. కానీ, పవన్‌ ప్రపోజల్‌కి కమలనాథుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో గందరగోళం కంటిన్యూ అవుతూ వస్తోంది. 2024 ఎన్నికలు టార్గెట్‌గా పాత మిత్రులను కూడా కలుపుకొంటోన్న బీజేపీ… టీడీపీ విషయంలో మాత్రం డిస్టెన్స్‌ పాటిస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీఏ మీటింగ్‌కి పాత మిత్రులెందర్నో పిలిచిన బీజేపీ…. తెలుగుదేశానికి మాత్రం ఆహ్వానం పంపకపోవడం మరింత గందరగోళంలోకి నెట్టేసింది. పవన్‌ కల్యాణ్‌ ఏమో… జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయాలనుకుంటుంటే, అందుకు భిన్నమైన సంకేతాలు బీజేపీ నుంచి వస్తున్నాయ్‌!.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...