MegaStar Chiranjeevi: సీఎం జగన్ ను ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి... ( వీడియో )
Chiranjeevi Praises Jagan

MegaStar Chiranjeevi: సీఎం జగన్ ను ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి… ( వీడియో )

|

Jun 23, 2021 | 11:08 PM

కరోనా బారిన నుంచి తెలుగు ప్రజలను రక్షించడంలో చొరవ చూపించడమే కాదు. ప్రజలకు అండగా నిలస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించడంలో ముందున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

కరోనా బారిన నుంచి తెలుగు ప్రజలను రక్షించడంలో చొరవ చూపించడమే కాదు. ప్రజలకు అండగా నిలస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించడంలో ముందున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. బ్లడ్‌ బ్యాంక్‌ తరహాలోనే ఆక్సిజన్ బ్యాంకులను సిద్దం చేసి, సామాన్యులకు ఊపిరి పోస్తున్న చిరు… తాజాగా మెగా వాక్సినేషన్ తో ఏపీ ప్రజలను.. మహమ్మారి నుంచి రక్షించిన జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు

 

 

మరిన్ని ఇక్కడ చూడండి: వన్‌ ఇయర్‌ బర్త్‌డే జరుపుకున్న నెలలు నిండకుండా పుట్టిన బేబీ .. ! ! ( వీడియో )

ఒళ్ళంతా జుట్టు.. బరువు మోయలేక ఇబ్బంది పడుతున్న కుక్క.. చివరికి ఏమైంది అంటే.. ( వీడియో )