Mallikarjun Kharge: ఏఐసీసీ పార్టీ పగ్గాలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే.. కొత్త శకం షురూ..(లైవ్)
Mallikarjun Kharge Congress President: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఖర్గే.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ నిరాకరించడం, సోనియా, ప్రియాంక కూడా ఆసక్తి చూపకపోవడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే తోపాటు.. శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఖర్గే.. శశిథరూర్‌పై ఖర్గే 84 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో అనుభవంతోపాటు.. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం కూడా ఖర్గేకి కలిసివచ్చింది. మొత్తం 9385 మంది ప్రతినిధులు ఓటు వేయగా.. మల్లిఖార్జున ఖర్గేకు 7897 ఓట్లు వచ్చాయి. థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో 416 ఓట్లు చెల్లలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.