Karnataka New CM: ఎల్లుండే కర్నాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. ఎవరంటే..?
కర్నాటక అధికార పీఠం కాంగ్రెస్ వశమైంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందన్నది? కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఉంది. ఎన్నికల సమయంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా వ్యవహరించింది.
కర్నాటక అధికార పీఠం కాంగ్రెస్ వశమైంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందన్నది? కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఉంది. ఎన్నికల సమయంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా వ్యవహరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో అనుసరించిన విధానాన్నే కర్నాటకలోనూ కాంగ్రెస్ అనుసరించింది. కలిసికట్టుగా పనిచేయాలని, గెలిచిన తర్వాత సీఎంను డిసైడ్ చేద్దామని హైకమాండ్ ప్రకటించడంతో అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం శ్రమించారు. ఆ శ్రమకు ఫలితం దక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. కర్నాటకలో ఇద్దరు నేతలే పోటీలో ఉండగా హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ముచ్చటగా ముగ్గురు నాయకులు సీఎం పదవి కోసం పోటీపడ్డారు. ఫలితాల తర్వాత అందర్ని కూర్చొబెట్టి కాంగ్రెస్ నేతలు ఎటువంటి తగువులు, అసమ్మతి తలెత్తకుండా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసింది. ఇప్పుడు కర్నాటకలో ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!