ఓ చేతిలో వల.. మరో చేతిలో చేప.. మత్స్యకారుని వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే..

| Edited By: Shaik Madar Saheb

Jun 22, 2024 | 3:30 PM

ఎంత ఎదిగినా సొంత సామాజిక వర్గాన్ని, ఊరును మర్చిపోకూడదు అంటారు పెద్దలు.. అందుకేనేమో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినా తన మూలాలు మరిచిపోలేదు. ఏపీ అసెంబ్లీలో తొలి రోజైన శుక్రవారంనాడు (జూన్ 21) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సాంప్రదాయ మత్సకారుని వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు.

ఎంత ఎదిగినా సొంత సామాజిక వర్గాన్ని, ఊరును మర్చిపోకూడదు అంటారు పెద్దలు.. అందుకేనేమో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినా తన మూలాలు మరిచిపోలేదు. ఏపీ అసెంబ్లీలో తొలి రోజైన శుక్రవారంనాడు (జూన్ 21) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సాంప్రదాయ మత్సకారుని వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. ఒక చేతిలో వల.. మరో చేతిలో చేపను చేతబూని అసెంబ్లీకి వచ్చారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. 2024 ఎన్నికలలో గెలిచిన బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

దీంతో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న వేళ.. తమ మత్సకార సామాజిక వర్గం జీవన శైలిని అందరికీ తెలియచేసేలా ఇలా మత్సకార వేశాధారణలో వచ్చానాని బొమ్మడి నాయకర్ తెలిపారు. మత్సకారులు జీవనోపాధి రానురాను దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వారి జీవనోపాధి ప్రశ్నర్ధకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మత్సకారులకు జీవనోపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. మత్సకార వర్గానికి చెందిన తాను 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా.. మళ్ళీ 2024లో అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు రుణపడి ఉంటానని చెప్పారు. మత్సకార సామాజిక వర్గంతో పాటు నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

Follow us on