Watch Video: ఇస్త్రీ పెట్టె పట్టుకున్న మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నాయకులపై చురకలు..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తమదైన శైలిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రచారంలో భాగంగా లాండ్రీ షాప్లో ప్రచారానికి వెళ్లిన జయనగేశ్వర్ రెడ్డి ఆ ఇస్త్రీ పెట్టెను పట్టుకున్నారు. 'ఏంది ఇంత వేడిగా ఉంది.. వైసీపీ వాళ్లపై ఉన్న కోపం అంతా ఈ పెట్టె మీద పెట్టావా ఏంటి' అన్నారు. 'ఈ ఇస్త్రీ పెట్టె బాగా వేడిగా ఉంది.. మనల్ని మోసం చేసిన వైసీపీ నాయకులు వస్తే, ఈ వేడి పెట్టాను తీసి వాళ్లకు పెట్టు' అంటూ సెటైర్లు వేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తమదైన శైలిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రచారంలో భాగంగా లాండ్రీ షాప్లో ప్రచారానికి వెళ్లిన జయనగేశ్వర్ రెడ్డి ఆ ఇస్త్రీ పెట్టెను పట్టుకున్నారు. ‘ఏంది ఇంత వేడిగా ఉంది.. వైసీపీ వాళ్లపై ఉన్న కోపం అంతా ఈ పెట్టె మీద పెట్టావా ఏంటి’ అన్నారు. ‘ఈ ఇస్త్రీ పెట్టె బాగా వేడిగా ఉంది.. మనల్ని మోసం చేసిన వైసీపీ నాయకులు వస్తే, ఈ వేడి పెట్టాను తీసి వాళ్లకు పెట్టు’ అంటూ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 11, 2024 01:08 PM