Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం.. భద్రాచలంలో భారీ బహిరంగ సభ.. వీడియో

సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ్టి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి రోజు పూజలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. దర్శనం తర్వాత నేరుగా భద్రాచలం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు.

Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం.. భద్రాచలంలో భారీ బహిరంగ సభ.. వీడియో

|

Updated on: Mar 11, 2024 | 1:44 PM

సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ్టి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి రోజు పూజలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. దర్శనం తర్వాత నేరుగా భద్రాచలం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డ్ గ్రౌండ్‌లో సుమారు 5వేల మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు పధకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో కలిసి చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరు ప్రజాదీవెన సభలో రేవంత్ పాల్గొంటారు.

మణుగూరులో జరిగే బహిరంగ సభ ద్వారా ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మణుగూరులో జరిగే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us