Watch Video: ‘ప్రత్యేక హోదా సహా ఇతర డిమాండ్లను సాధించాలి’.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..

రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌. ఏపీ ఎన్నికల్లో ఓటమి తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇంతకు ముందెన్నడూ లేని అభివృద్ధి చేసి చూపించానన్నారు. అయినా ప్రజలు ఇంకేం ఆశించారో అర్థం కావడం లేదన్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి కంచుకోటలాంటి ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పరిణతిగల నాయకుడిలా మాట్లాడారన్నారు.

Watch Video: 'ప్రత్యేక హోదా సహా ఇతర డిమాండ్లను సాధించాలి'.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..

|

Updated on: Jun 08, 2024 | 1:45 PM

రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌. ఏపీ ఎన్నికల్లో ఓటమి తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇంతకు ముందెన్నడూ లేని అభివృద్ధి చేసి చూపించానన్నారు. అయినా ప్రజలు ఇంకేం ఆశించారో అర్థం కావడం లేదన్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి కంచుకోటలాంటి ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పరిణతిగల నాయకుడిలా మాట్లాడారన్నారు. ఇదే క్రమంలో టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తమపై నిందలు వేసి.. ఇప్పుడు టీడీపీ వాళ్లు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. దాడుల సంస్కృతి మంచిది కాదని సూచించారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదని.. ఈ సమయంలో రాష్ట్రానికి రావల్సిన వాటిపై కేంద్రాన్ని డిమాండ్‌చేసే అవకాశం టీడీపీకి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా సహా ఇతర డిమాండ్లను సాధించాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow us