Droupadi Murmu: అప్పట్లో కలాం.. ఇప్పుడు ముర్ము..

Updated on: Dec 29, 2025 | 8:36 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ హార్బర్ వద్ద ఐఎన్ఎస్ వాగ్‌షీర్ సబ్‌మెరైన్‌లో చారిత్రక ప్రయాణం చేశారు. 2006లో అబ్దుల్ కలాం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో రాష్ట్రపతి ఆమె. ఇటీవల రాఫెల్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో ఆమె సాహసయాత్రల పరంపరలో ఇది మరో అడుగు, స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో చారిత్రక ఘనతను సాధించారు. దేశ సైనిక దళాలకు స్ఫూర్తినిచ్చే క్రమంలో ఆమె కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నేవీ బేస్‌లో ఐఎన్ఎస్ వాగ్‌షీర్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు. చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఆమె వెంట ఉన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ కల్వరీ క్లాస్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. గతంలో 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇదే తరహా సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్కార్ భూమికి ఎసరు పెట్టిన రెవెన్యూ అధికారులు

Silver Price Today: ఒక్క రోజులో రూ.21,500 తగ్గిన కేజీ వెండి ధర

ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి

KTR: కేసీఆర్ ను తిట్టడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు

ఇళ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్న వానరాలు