Telangana Assembly: అసెంబ్లీలో కాగ్ నివేదిక.. బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతుందా..
Cag Report

Telangana Assembly: అసెంబ్లీలో ‘కాగ్’ నివేదిక.. బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతుందా..

|

Feb 15, 2024 | 10:21 AM

తెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది.. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది..ఇందుకు అసెంబ్లీలో నేడు తీర్మానం ప్రవేశ పెట్టనుంది..అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టనుంది..ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఇందుకు ఆమోద ముద్ర వేసింది.. అసెంబ్లీలో ఈ మధ్యాహ్నం రెండుగంటలకు BC కులగణనపై తీర్మానం ప్రవేశపెడతారు.

తెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది.. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది..ఇందుకు అసెంబ్లీలో నేడు తీర్మానం ప్రవేశ పెట్టనుంది..అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టనుంది..ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఇందుకు ఆమోద ముద్ర వేసింది.. అసెంబ్లీలో ఈ మధ్యాహ్నం రెండుగంటలకు BC కులగణనపై తీర్మానం ప్రవేశపెడతారు. BCల్లో మొత్తం 136 కులాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. జనాభాలో ఏ సామాజిక వర్గం, ఎంత శాతం ఉందో తేల్చేందుకు కులగణన చేపట్టాలనేది ఈ తీర్మానం ఉద్దేశం. ఇప్పటికే ఈ తీర్మానంపై అధికార, ప్రతిపక్షాలతో స్పీకర్‌ చర్చించారు. వాస్తవానికి BC కులగణనపై నిన్ననే అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంది. కానీ నిన్న కుదరకపోవడంతో ఇవాళ ఈ తీర్మానాన్ని తీసుకువస్తున్నారు. అయితే BC కులగణన ఎప్పటివరకు చేపట్టాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో అన్నదానిపై అసెంబ్లీ చర్చిస్తుంది. అలాగే కులగణనకు విధివిధానాలు రూపొందించడంపై కూడా చర్చిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??

ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??

ఈ రోజున అక్షరాలు దిద్దిస్తే.. అద్భుతాలు జరుగుతాయా ??

Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది

Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??

Published on: Feb 15, 2024 10:21 AM