CM KCR: బండెనక బండి కట్టి.. 750 కార్లతో.. మహారాష్ట్రకు పయనమైన సీఎం కేసీఆర్..

|

Jun 26, 2023 | 11:16 AM

5 వందల కార్లు.. 2వేల మంది ప్రజాప్రతినిధులు.. భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ప్రగతి భవన్ టూ మహారాష్ట్రకు బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు సైతం మహారాష్ట్ర టూర్‌కు వెళ్తున్నారు.

5 వందల కార్లు.. 2వేల మంది ప్రజాప్రతినిధులు.. భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ప్రగతి భవన్ టూ మహారాష్ట్రకు బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు సైతం మహారాష్ట్ర టూర్‌కు వెళ్తున్నారు. మహారాష్ట్ర పర్యటన కోసం సీఎం కేసీఆర్ స్వయంగా 400 మంది ముఖ్యనేతలకు ఫోన్ చేసి పలిపించినట్లు తెలుస్తుంది. దాదాపు 4గంటలపాటు భారీ కాన్వాయ్‌లో పయనించి.. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంత్రం 4.30కి సోలాపూర్‌ చేరుకొని.. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం మళ్లీ తిరుగు పయనం కానున్నారు.