YS Jagan: దేశంలో మొదటిసారిగా రూ.3వేల పెన్షన్‌ ఇచ్చాం.. పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి

|

Apr 08, 2024 | 12:29 PM

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. సోమవారం 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ పెన్షనర్లతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు.

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. సోమవారం 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ పెన్షనర్లతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ప్రతీ అవ్వాతాత కొన్ని విషయాలు ఆలోచన చేయాలని.. మన ప్రభుత్వం రాకమునుపు పెన్షన్‌ ఎంత వచ్చింది? అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందే పెన్షన్ వెయ్యి రూపాయలేనని.. దేశంలోనే మొట్టమొదటి సారిగా పెన్షన్ రూ.3వేలకు పెంచామన్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక రూ.3వేల పెన్షన్‌ వస్తుందని.. గ్రామ వాలంటీర్‌ ద్వారా ప్రతీనెల 1నే పెన్షన్‌ పంపిణీ చేస్తున్నామని వివరించారు.

ముఖాముఖి కార్యక్రమం తర్వాత.. సీఎం జగన్ బొదనంపాడు, కురిచేడు, చింతలచెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్‌కు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత చీకటిగలపాలెం మీదుగా వినుకొండ చేరుకుని… మధ్యాహ్నం 3గంటలకు భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్‌..

బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు..

మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేపడుతోన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు ప్రజానీకం బ్రహ్మరథం పడుతోంది. నిన్న ప్రకాశం జిల్లాలో సాగిన టూర్‌ ఇందుకు అద్దం పడుతోంది. కొనకనమెట్ల సభ, జనసంద్రాన్ని తలపించింది. వైసీపీ కార్యకర్తలు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలు పోటెత్తడంతో సభా ప్రాంతం హోరెత్తింది. జై జగన్‌ అనే నినాదాలతో సభా ప్రాంతం మార్మోగింది. సంక్షేమ సారథిని చూడటానికి, ఆయనతో కలచాలనం చేయడానికి ప్రజలు ఎగబడ్డారు. వీలైనన్నిచోట్లా.. ప్రజలను కలుస్తూ, వారితో మాట్లాడుతున్నారు వైఎస్‌ జగన్‌. ఒకటో నుంచి కూడా జగన్‌ యాత్రలకు వస్తోన్న విశేష స్పందన ఇది. దర్శిలో అయితే ప్రజాభిమానం పోటెత్తింది.