నేడు అమరావతిలో CRDA కార్యాలయం ఘనంగా ప్రారంభం

Updated on: Oct 13, 2025 | 1:33 PM

అమరావతిలో CRDA నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు 9:54 గంటలకు ప్రారంభించారు. 257 కోట్ల రూపాయలతో, 4.32 ఎకరాల్లో G+7 అంతస్తులుగా నిర్మించిన ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి నెట్ జీరో ఎనర్జీ అవార్డు లభించింది. ఇకపై CRDA కార్యకలాపాలు అమరావతి నుంచే జరగనున్నాయి.

అమరావతిలోని లింగాయపాలెం సరిహద్దులో గల రాజధాని ప్రాంతంలో 4.32 ఎకరాల విస్తీర్ణంలో 257 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన CRDA నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9:54 గంటలకు ప్రారంభించారు. G+7 అంతస్తుల ఈ భవనాన్ని అమరావతి సింబల్ A ఆకారంలో డిజైన్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి నారాయణ, CRDA కమిషనర్ అమరావతి రైతులను ఆహ్వానించారు. ఇకపై CRDA కార్యకలాపాలు అమరావతి నుంచే నిర్వహించబడతాయి. కార్యాలయ ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్, ADCL కార్యాలయం, మున్సిపల్ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రారంభోత్సవానికి ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి నెట్ జీరో ఎనర్జీ అవార్డును ఈ భవనం సొంతం చేసుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI వీడియోలపై నిషేధం !! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

బంగారం కొనేటప్పుడు ఈ 5 విషయాలు తెలుసుకోండి

గోల్డ్ లోన్ తీసుకున్నారా ?? ఇది మీ కోసమే

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కేబినెట్ ఆమోదం

చెరువు గట్టుపై భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు