సర్పంచ్ ఎన్నికల పోలింగ్ వేళ క్షుద్ర పూజల కలకలం

Updated on: Dec 16, 2025 | 7:37 PM

నారాయణపేట జిల్లా కాచ్వార్‌లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ వేళ క్షుద్ర పూజల కలకలం రేగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. కాంగ్రెస్ మద్దతుదారులే దీనికి కారణమని ఆరోపణలు రాగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తిని గుర్తించారు. ఈ ఘటన గ్రామస్తుల్లో ఆందోళన కలిగించింది.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ వేళ క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు తెల్ల ఆవాలు, పసుపు వంటి వస్తువులతో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఉదయాన్నే ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. క్షుద్ర పూజల ప్రభావం వల్లనే తమకు కీడు జరుగుతుందని భయపడిన వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బంధువులే కారణమని వెంకటమ్మ కుటుంబం ఆరోపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలి మంట దగ్గర లొల్లి… తలలు పగిలేలా కొట్టుకున్నారు

ఇండిపెండెంట్ అభ్యర్థి అర్జున్ పై హత్య యత్నం

ట్రంప్‌ వెర్రి.. వీసా వర్రీ.. కఠిన నిబంధనలు గురించి తప్పక తెలుసుకొండి

మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్‌ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్‌