తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజే పోటీ పడ్డ అభ్యర్థులు..

|

Apr 18, 2024 | 1:43 PM

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తొలిరోజే రంగంలోకి దిగిన బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ సహా మరికొందరు నేతలు ఇవాళ నామినేషన్‌ వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్‌ వేశారు. ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు.

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తొలిరోజే రంగంలోకి దిగిన బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ సహా మరికొందరు నేతలు ఇవాళ నామినేషన్‌ వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్‌ వేశారు. ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి ఈటల రాజేందర్‌ నామినేషన్ వేశారు. ఈటల తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. మల్కాజ్‌గిరి గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్నారు ఈటల రాజేందర్‌. సర్వేలకు అందకుండా భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన డీకే అరుణను బలపరిచారు ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌. కాటన్‌మిల్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసిన డీకే అరుణ.. అక్కడి నుండి భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. నామినేషన్ పత్రాలను కలెక్టరేట్‌కు అందజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..