Watch Video: ఏపీ ఎన్నికల్లో పొత్తులపై సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో 2014 తరహాలో మూడు పార్టీల కూటమి పొత్తులు పొడుస్తాయని బీజేపీ నేత సుజనా చౌదరి అంటున్నారు. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో ఉందని, అదే సమయంలో తెలుగుదేశంతో కూడా పొత్తులు కొనసాగిస్తోందని చెప్పారు. త్వరలో బీజేపీ కూడా చేరి మూడు పార్టీల కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడేందుకే చాలా అవకాశాలన్నాయారు బీజేపీ నేత సుజనా చౌదరి. ఏపీలో గతంలో బీజేపీ ఆరు ఎంపీ స్థానాలు గెలిచిన చరిత్ర ఉన్నా.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయని అన్నారు. పొత్తులో సీట్లపై మంచి నెంబర్ కోసమే మూడు పార్టీలు చర్చిస్తున్నాయన్నారు సుజనా. అలాగే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు తాను వ్యతిరేకం కాదని, పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు. ఏపీలో ఆర్థికపరిస్థితి చిన్నాభిన్నంగా ఉందన్నారు. సంపద సృష్టి ద్వారా సంక్షేమం అమలు చేసి ఉంటే బాగుండేదని.. అయితే అలా జరగలేదన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం లాభపడాలంటే ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని చెబుతున్న మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరితో మా ఢిల్లీ ప్రతినిధి మహాత్మ ఫేస్ టూ ఫేస్.
Published on: Feb 08, 2024 06:33 PM