చంద్రబాబు అరెస్ట్‌ వెనుక ఉన్నది బీజేపీనే: రఘువీరా

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక ఉన్నది బీజేపీనే: రఘువీరా

Ram Naramaneni

|

Updated on: Sep 29, 2023 | 3:38 PM

చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి స్పందించారు. ఈ పరిణామాల వెనుక ఉన్నది బీజేపీ అని స్పష్టం చేశారు. ఏపీలో ఎదగాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. కాకపోతే వైసీపీ భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందని చెప్పారు. భవిష్యత్‌లో జగన్‌కు కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు. వీడియో చూడండి...

సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. జగన్ భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని ఆరోపించారు. టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టిన ప్రయోజనం శూన్యమన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి టీడీపీ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని పేర్కొన్నారు.  ఈ పరిణామాలకు మూల కారణం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాలనుకోవడమే అని చెప్పుకొచ్చారు. ఏదో ఒకరోజు జగన్‌కు కూడా ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు రఘువీరారెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 29, 2023 03:29 PM