Big News Big Debate: కన్నడ నాట విజయం ఎవరిది ?? లైవ్ వీడియో
స్వాతంత్ర్యానంతరం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి... వర్తమాన రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీకి లైఫ్ డెత్ ఎలక్షన్ కర్నాటక. సందేహం లేకుండా వందశాతం ఆయా పార్టీలకు ఇది చావోరేవో ఎన్నికే. పట్టు చిక్కని దక్షణాదిలో..
స్వాతంత్ర్యానంతరం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి… వర్తమాన రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీకి లైఫ్ డెత్ ఎలక్షన్ కర్నాటక. సందేహం లేకుండా వందశాతం ఆయా పార్టీలకు ఇది చావోరేవో ఎన్నికే. పట్టు చిక్కని దక్షణాదిలో ఉన్న ఒక్కరాష్ట్రంలో నూ అధికారం పోతే బీజేపీ ప్రతిష్టకు అది పెనుసవాలుగా మారుతుంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలన్న పార్టీ లక్ష్యంపై నీరుగారే ప్రమాదం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి కర్నాటక గెలిస్తే జవసత్వాలు వస్తాయి. పాజిటివ్ మూడ్ ఉన్నా… చివరి దాకా నిలబెట్టుకుని అధికారంలో వస్తుందా రాదా అన్న అనుమానం పార్టీలోనే కాదు కాంగ్రెస్ మిత్రపక్షాల్లోనూ ఉంది. ఇక్కడ గెలిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేయడానికి అనేకపార్టీలు ముందుకొస్తాయి. అంతేకాదు తెలంగాణ సహా వచ్చే సాధారణ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో కేడర్ బరిలో దిగుతోంది. కర్నాటకలో ఓడితే ఈ ప్రభావం జాతీయ రాజకీయాలు… కాంగ్రెస్ నాయకత్వ పనితీరుపై తప్పకుండా ఉంటుంది. రెండు జాతీయ పార్టీలు పరస్పరం పోటీపడుతున్న కర్నాటక రాష్ట్రంలో జనం ఏమనుకుంటున్నారు?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ కోసం పోటెత్తుతున్న ఫ్యాన్స్.. దద్దరిల్లుతోన్న బాంబే ఓజీ లొకేషన్
Chiranjeevi VS Ranbir Kapoor: చిరంజీవి VS రణ్బీర్ కపూర్.. వంగ కారణంగా మొదలైన యుద్ధం
Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..
కలసిన బావ బామ్మర్దుల.. హంగామా షురూ..
రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!