Big News Big Debate: 2024లో ఏపీ CM ఎవరు..? పవన్ కల్యాణ్ మ్యాథమేటిక్స్..
2024లో ఏపీ CM ఎవరు..? మళ్లీ అధికారం తమదేనని YCP ధీమాగా ఉంది. జగన్ 30 ఏళ్లు CMగా ఉంటారని ఢంకా బజాయిస్తోంది..! ఇటుచూస్తే ఈసారి తాము అధికారం లాక్కోవడం ఖాయమనేది విపక్షాల మాట..! ఇంతకీ.. ఇటువైపు నుంచి CM అభ్యర్థి ఎవరు..? చంద్రబాబా.. పవన్ కల్యాణా.. మరొకరా..? ఈ చర్చకు తెరదించేలా ఇవాళ పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..!
2024లో ఏపీ CM ఎవరు..? మళ్లీ అధికారం తమదేనని YCP ధీమాగా ఉంది. జగన్ 30 ఏళ్లు CMగా ఉంటారని ఢంకా బజాయిస్తోంది..! ఇటుచూస్తే ఈసారి తాము అధికారం లాక్కోవడం ఖాయమనేది విపక్షాల మాట..! ఇంతకీ.. ఇటువైపు నుంచి CM అభ్యర్థి ఎవరు..? చంద్రబాబా.. పవన్ కల్యాణా.. మరొకరా..? ఈ చర్చకు తెరదించేలా ఇవాళ పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..! కండిషన్లు పెడితే CM పదవి రాదని స్పష్టంగా అన్నారు.. తాను కింగా.. కింగ్ మేకరా అనే దానిపై ఆయనకో క్లారిటీ ఉన్నట్టుంది..అందుకే.. కర్నాటక కుమారస్వామిలా 40 సీట్లు అంటూ మాట్లాడారు. పొత్తులకు ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం అని చెప్పుకొచ్చారు..!
సత్తా ఏంటో చూపించి సీఎం పదవి అడుగుతామనే సంకేతాలు పంపారు.. సో.. ముందస్తు ఎన్నికలైనా, షెడ్యూల్ ప్రకారం 2024లోనే ఎలక్షన్స్ జరిగినా.. పొత్తులు, CM అభ్యర్థిపై త్వరలోనే పూర్తి స్పష్టత రాబోతోంది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.. పవన్ కల్యాణ్ ఎవరితో కలిసి వెళ్తారు..?
1. జనసేన- టీడీపీ కలిసి పోటీ చేస్తాయా..?
2. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా..?
3. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా..?
4. జనసేన, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా..?
ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది.. తెలంగాణతోపాటు డిసెంబర్‌లో ముందస్తు జరిగే ఛాన్స్ ఉందా..? అందుకే ఈ పొత్తులు.. ఎత్తుల చర్చలు జరుగుతున్నాయా..? అనే విషయాలను బిగ్ న్యూస్ బిగ్ డిడేట్ లో చూద్దాం..