Big News Big Debate: రాజకీయ రణక్షేత్రం.. పార్టీ మారమని కవితకు ఆఫర్ చేసిందెవరు..? రెడీ టు ఫైట్ అంటూ కేసీఆర్..
పార్టీ మారమని కవితకు ఆఫర్ చేసిందెవరు.? రెడీ టు ఫైట్ అని కేసీఆర్ ఎందుకంటున్నారు..? రణక్షేత్రంలో కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందా.? ప్రధానప్రత్యర్ధి స్థానం బీజేపీదేనా..?
2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో పార్టీలన్నీ సమరశంఖం పూరించాయి. మోదీ వచ్చి తెలంగాణలో కమలం వికసిస్తుందని బలంగా చాటి వెళ్లిన కొద్ది గంటల్లోనే 95 సీట్లతో హ్యాట్రిక్ విజయం తమదేనంటూ కేడర్‌కు అభయమిచ్చారు సీఎం కేసీఆర్. ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టినట్టు మునుగోడులో గుర్తించిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమకే పట్టం కడతారంటోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వికృతరాజకీయంపై ధర్మయుద్ధం మొదలైందని కేసీఆర్ ప్రకటిస్తే.. అంతకుముందే కుటుంబ అవినీతి పాలనకు చెరమగీతం పాడతామని మోదీ బేగంపేటలో వ్యాఖ్యానించారు. అయితే TRS – BJP మధ్య రహస్య ఒప్పందం నడుస్తుందని.. ఇది గమనించిన ప్రజలు తమను గెలిపించడానికి రెడీగా ఉన్నారంటోంది కాంగ్రెస్ పార్టీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos