Big News Big Debate: ట్రిపుల్.. ట్రబుల్..! కేంద్రం అమరావతికి అనుకూలమా.? రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలమా.?(లైవ్)

Updated on: Feb 09, 2023 | 7:03 PM

కేంద్రం అఫిడవిట్‌ అమరావతికి అనుకూలమా..? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి సానుకూలమా.? రాజధాని కేసులో సెంటర్‌ పాయింట్‌ ఏంటి..? లీగల్‌ బ్యాటిల్‌పై ఏపీలో పొలిటికల్‌ వార్‌..

మార్చి తర్వాత విశాఖ నుంచే పాలన ఉంటుందని అధికారపార్టీ పదేపదే చెబుతోంది. అసాధ్యమని విపక్షాలు వాదిస్తున్నాయి.. పార్టీల మధ్య ఈ రాజకీయ దుమారం నడుస్తుండగానే తాజాగా కేంద్రం కూడా ఇందులో ఎంట్రీ ఇచ్చింది. అటు పార్లమెంటులో చెప్పిన సమాధానం… ఇటు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనూ కేపిటల్‌పై అభిప్రాయాన్ని వెల్లడించిన కేంద్రం కీలక అంశాలను ప్రస్తావించింది. అంతే అత్యున్నత న్యాయస్థానంలో లీగల్‌ బ్యాటిల్‌ కొనసాగుతుండగానే పార్టీలు ఎవరి వెర్షన్‌తో వారు దీనిపై కొత్త కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నారు.రాజధానిపై రాష్ట్రంలో రచ్చ మామూలుగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖకు సీఎం వెళతారా అన్న చర్చ జరుగుతున్న సమయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాజధానిపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్-6 ప్రకారం శివరామకృష్ణన్ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అనంతరం 23 ఏప్రిల్ 2015న అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని అఫిడవిట్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2వేల 500 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. అటు పార్లమెంట్లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఇచ్చింది కేంద్రం. ఈ రెండింటి ఆధారంగా రాజధాని అమరావతి అని మరోసారి తేటతెల్లం అయిందని… ఎవరూ ఆపలేరంటున్నాయి విపక్షాలు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 09, 2023 07:02 PM