Andhra Pradesh: ఏపీలో గెలుపు మంత్రం బీసీ కార్డేనా..! బ్యాక్‌వర్డ్‌ ఎవరికి బ్యాక్‌బోన్‌ కాబోతోంది

Updated on: Mar 05, 2024 | 8:57 PM

Big News Big Debate : ఏపీ రాజకీయాల్లో మరోసారి బీసీకార్డ్‌ తెరమీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో బీసీ వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గెలుపు తంత్రం కోసం ప్రధానంగా బీసీమంత్రాన్ని జపిస్తున్నాయి. అటు సంక్షేమంలో, ఇటు అధికారంలో బీసీలకు సగభాగం ఇచ్చామని అధికార పార్టీ వైసీపీ చెబుతుంటే..

Big News Big Debate : ఏపీ రాజకీయాల్లో మరోసారి బీసీకార్డ్‌ తెరమీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో బీసీ వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గెలుపు తంత్రం కోసం ప్రధానంగా బీసీమంత్రాన్ని జపిస్తున్నాయి. అటు సంక్షేమంలో, ఇటు అధికారంలో బీసీలకు సగభాగం ఇచ్చామని అధికార పార్టీ వైసీపీ చెబుతుంటే.. వారి హక్కుల కోసమే డిక్లరేషన్‌ అంటోంది టీడీపీ, జనసేన కూటమి. ఎవరికి వారు వెనకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యమని ప్రకటిస్తూ… హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ, ఏపీలో బీసీ జనం ఎవరివైపు ఉంటారన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మంగళగిరి వేదికగా నిర్వహించిన ఉమ్మడి సభలో డిక్లరేషన్‌ ప్రకటించిన తెలుగుసేనకు జై కొడుతారా? లేక వైసీపీకి అండగా నిలబడతారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Mar 05, 2024 06:58 PM