Big News Big Debate: ఓట్ల వేటలో హామీ - తుమీ.. ఆంధ్రాలో హీటెక్కిన ఎన్నికల రాజకీయం

Big News Big Debate: ఓట్ల వేటలో హామీ – తుమీ.. ఆంధ్రాలో హీటెక్కిన ఎన్నికల రాజకీయం

Ram Naramaneni

|

Updated on: May 29, 2023 | 7:04 PM

ఇటీవల కాలంలో వివిధ సభల్లో పాల్గొంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. విపక్షాలపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు. చంద్రబాబు అండ్‌ కో అంటూ కన్నెర్ర చేస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య వార్‌ జరుగుతోందని చెబుతూనే.. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో దేవుడితోపాటు జనమే తనకు అండగా ఉంటారని గట్టి ధీమాతో ప్రకటనలు చేస్తున్నారు.

ఎన్నికలు ఏవైనా పార్టీలకు అత్యంత కీలకం. నెగ్గడానికి అనేక ఎత్తుగడలు వేస్తాయి. కానీ.. ఇటీవల కాలంలో ఎలక్షన్స్‌ అంటే అర్థమే మారిపోయింది. గతానికి ఇప్పటికి పోలికే లేదు. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి.. వాటికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న వైసీపీ.. విపక్ష టీడీపీలు తమ అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాయి. గతంలో సింగిల్‌ పేజీలో నవరత్నాలతో జనాల మనసు దోచుకుంది వైసీపీ… ఇప్పుడు టీడీపీ కూడా రోటీన్‌ మానిఫెస్టోలకు భిన్నంగా సింపుల్‌ అండ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అంటోంది. మరి వర్కువుట్‌ అవుతుంది… అంతకంటే ముందు ప్రత్యర్థుల ప్రశ్నలకు సమాధానాలున్నాయా?