Bharat Bandh: ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!

|

Aug 24, 2024 | 4:16 PM

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌‌కు మిశ్రమ స్పందన లభించింది. రిజర్వేషన్‌ బచావో సమితి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అమలును ఉపసంహరించుకోవాలని ఈ వర్గం డిమాండ్. ఏపీ, తెలంగాణలో బంద్‌ ప్రభావం కొన్ని చోట్ల కనిపించింది. ఆర్టీసీ బస్సులు పలు డిపోల్లో నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లో ఈరోజు సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు.

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌‌కు మిశ్రమ స్పందన లభించింది. రిజర్వేషన్‌ బచావో సమితి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అమలును ఉపసంహరించుకోవాలని ఈ వర్గం డిమాండ్. ఏపీ, తెలంగాణలో బంద్‌ ప్రభావం కొన్ని చోట్ల కనిపించింది. ఆర్టీసీ బస్సులు పలు డిపోల్లో నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లో ఈరోజు సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోనూ ఎస్సీ వర్గీకరణ తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. రాజోలు దీవిలో తెల్లవారుజాము నుంచే రోడ్డుపైకి వచ్చారు. రాజోలు ఆర్టీసీ డిపో, జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు మాల మహానాడు నాయకులు. భారత్‌ బంద్‌కు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాటు, రాపాక వరప్రసాద్‌, గొల్లపల్లి సూర్యారావు. భారత్‌ బంద్‌ కారణంగా ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఏలూరులో వ్యాపార, వాణిజ్య సంస్థలకు స్వచ్ఛందంగా బంద్ పాటించారు వ్యాపారులు. ఇక, ఏలూరు ఆర్టీసీ డిపో ముందు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు ఆందోళనకారులు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలోనూ నిరసనలు జరుగుతున్నాయ్‌. భారత్‌ బంద్‌కు పలు దళిత, ఆదివాసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళనలు జరిగాయి. ఎస్సీ వర్గీకరణ తీర్పునకు వ్యతిరేకంగా సిరిసిల్ల ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టింది మాలల ఐక్యవేదిక. రాజ్యాంగ హక్కులను, ఎస్సీల హక్కులను కాలరాసే విధంగా సుప్రీం ఉందంటూ నినాదాలు చేశారు ఆందోళనకారులు. నిర్మల్‌ జిల్లా భైంసాలో నిరసనలు చేపట్టారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.