Hyderabad: మహిళా కమిషన్ కార్యాలయంకు కేటీఆర్.. తీవ్ర ఉద్రిక్తత
తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. మరోవైపు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు. బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో.. ఇరు వర్గాల మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మహిళా సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో తన వ్యాఖ్యల పట్ల ఆయన ఎక్స్‌లో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు 11 గంటల సమయంలో కార్యాలయంకు వచ్చారు కేటీఆర్. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. KTR వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ మహిళా నేతలు పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట చెలరేగింది. ఇరువర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల.. ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

