అసంతృప్తితో రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదు.. బాలినేని సెన్సేషనల్ కామెంట్స్..
మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తన పంతం నెగ్గించుకునే విషయంలో రాజీనామా చేయడం పెద్ద విషయం కాదన్నారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతనూతలపాడు, కొండపి విషయంలో తనకు చెప్పకుండానే టిక్కెట్లు ఇచ్చారు..
మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తన పంతం నెగ్గించుకునే విషయంలో రాజీనామా చేయడం పెద్ద విషయం కాదన్నారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతనూతలపాడు, కొండపి విషయంలో తనకు చెప్పకుండానే టిక్కెట్లు ఇచ్చారు.. అసంతృప్తితో రాజీనామా చేయడం ఒక సెకను పట్టదన్నారు. ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు.. అన్నీ సమస్యలు సామరస్యంగానే పరిష్కారమవుతాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం అభ్యర్ధిని గెలిపించుకునే బాధ్యత తనపైనే ఉంది.. గెలుపించుకుని తీరుతానని చెప్పారు బాలినేని.
మరోవైపు ఎంపీ మాగుంట సీటు విషయంలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒంగోలులో 30 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్న మాగుంటను వదులుకోవడం ఇష్టం లేదన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని వైసీపీ నుంచి పోటీ చేయించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానన్నారు బాలినేని. మరోవైపు ఒంగోలులో ఇళ్లపట్టాల విషయంలో సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేసుకున్నాం.. 25వేల మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టాలు పంపిణీ చేయడమే కాదు.. వారికి సౌకర్యవంతమైన ఇళ్లుకూడా కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు మాజీ మంత్రి బాలినేని.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

