Delhi Polls Result: ఆప్ దిగ్గజాలు.. త్రిమూర్తులు అవుట్..! అంతర్మథనంలో చీపురు పార్టీ..
దిగ్గజాలు.. త్రిమూర్తులు అవుట్... యస్...ఆప్ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదరుదెబ్బ తగిలింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్‌వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడించారు. ఇటు జంగ్‌పురాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు.
దిగ్గజాలు.. త్రిమూర్తులు అవుట్… యస్…ఆప్ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదరుదెబ్బ తగిలింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్‌వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడించారు. ఇటు జంగ్‌పురాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. 675 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తర్విందర్‌సింగ్ చేతిలో మనీష్ సిసోడియా ఓడిపోయారు. ఇటు షాకూర్ బస్తీలో మరో కీలక నేత సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఈ ముగ్గురు నేతలు లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లినవారే.
ఇటు కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ… అతి కష్టం మీద విజయకేతనం ఎగురవేశారు. 9వ రౌండ్ వరకూ వెనుకంజలో ఉన్న అతిశీ.. 10 రౌండ్ నుంచి ముందుంజలోకి వచ్చి విజయం సాధించారు. మొత్తంగా ఉద్దండుల పరాజయంతో ఆప్‌లో అంతర్మథనం మొదలైంది.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
