Social Media: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం

Updated on: Sep 06, 2025 | 1:16 PM

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా కేబినెట్‌ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించింది. ఫేక్ పోస్ట్‌లు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ఈ అంశంపై కేబినెట్‌ భేటీలో కూడా చర్చించారు. సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్లు విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు. వీటిలో ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టే వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా పోస్టులను ఇకపై పూర్తిగా రివ్యూ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నా, వ్యక్తిగత విమర్శలకు దిగినా, అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు కట్టబెడుతూ చట్టం తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏవైనా పోస్టులు పెడితే వాటికి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధారాలు సమర్పించకపోతే ఆయా పోస్టులను బట్టి వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ లాంటి వాటితో అనుసంధానం చేయడం ద్వారా ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టవచ్చని ఏపీ ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సోషల్‌ మీడియా పోస్టులపై చర్యల కోసం ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు

‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!

ఇన్‌స్టాలో పరిచయం.. పార్టీ పేరుతో స్కెచ్‌.. బాత్రూమ్‌లోకి పడేసి.. అత్యాచారం?

Dulquer Salmaan: వివాదంలో కొత్త లోక.. దిగొచ్చి క్షమాపణ చెప్పిన దుల్కర్