ప్రజలందరూ ఓటేసేందుకు కదిలిరావాలి.. పులివెందులలో సీఎం జగన్..

|

May 13, 2024 | 8:29 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బాకారాపురం జయమ్మ కాలనీలో ఓటు వేశారు. 138వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో ఉదయం 7 గంటలకే సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తన సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ ఓటు వేశారు. సీఎం జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అభిమానులు. వైఎస్ భారతిని కూడా కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు అభిమానులు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బాకారాపురం జయమ్మ కాలనీలో ఓటు వేశారు. 138వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో ఉదయం 7 గంటలకే సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తన సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ ఓటు వేశారు. సీఎం జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అభిమానులు. వైఎస్ భారతిని కూడా కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు అభిమానులు. ఈ సందర్భంగా సీఎం జగన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓటర్లకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుండి అని చైతన్య పరిచారు. ప్రజలందరూ కదిలిరావాలి.. తప్పకుండా ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలు, యువతీయుకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సామాజికవర్గాలకు తప్పకుండా ఓటు వేయండని సందేశాన్ని ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow us on