కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఇడుపులపాయ, సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పులివెందుల మండల నేతలతో జగన్ సమావేశం అవుతారు. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్‌ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు సీఎం జగన్. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాసేపట్లో.. సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రేపు ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం జగన్ తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..