CM Chandrababu Naidu: 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం

Edited By:

Updated on: Nov 25, 2025 | 10:33 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయనుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. ఐదు రెవెన్యూ డివిజన్‌లు, రెండు కొత్త మండలాల ఏర్పాటుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలకు అనుగుణంగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. పోలవరం ముంపు బాధితుల సమస్యల పరిష్కారం, ఆ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వన్డే సిరీస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

చైనా ఓవరాక్షన్‌.. భారత మహిళపై వేధింపులు

PM Modi: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్న ప్రధాని మోదీ

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే