Revanth Reddy Flex: తాడేపల్లిలో రేవంత్‌రెడ్డికి భారీ ప్లెక్సీ.! అంబటి ట్వీట్‌పై సోషల్ మీడియాలో చర్చ.

Updated on: Dec 04, 2023 | 6:57 PM

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపిలోనూ ఆసక్తి రేపాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పోలింగ్‌.. రిజల్ట్స్‌ వరకు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పక్కనే ఉన్న రాష్ట్రం కావడంతో గెలుపోటములు ఏపిలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున ఏపి ప్రజలు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపించారు. అదే విధంగా ఏ పార్టీ గెలుస్తుందన్న అంశంపై పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడిచాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపిలోనూ ఆసక్తి రేపాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పోలింగ్‌.. రిజల్ట్స్‌ వరకు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పక్కనే ఉన్న రాష్ట్రం కావడంతో గెలుపోటములు ఏపిలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున ఏపి ప్రజలు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపించారు. అదే విధంగా ఏ పార్టీ గెలుస్తుందన్న అంశంపై పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడిచాయి. ఈ క్రమంలోనే రేవంత్ కు తాడేపల్లిలోని జాతీయ రహదారిపై భారీ ప్లెక్స్ ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. గుంటూరు, విజయవాడ మధ్యన ఉన్న తాడేపల్లిలోనే సిఎం జగన్ నివాసం కూడా ఉండటం గమనించాల్సిన అంశం. సీఎం జగన్‌ నివాసానికి కూత వేటు దూరంలో రేవంత్ కు భారీ ప్లెక్స్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాహూల్ చౌదరి పేరుతో ఏర్పాటైన ప్లెక్స్ లో రేవంత్‌రెడ్డి సిఎంగా ప్రమాణం చేస్తున్నట్లు పేర్కొనడం విశేషం. ఈ అంశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి విజయంపై ఏపీ మంత్రి అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీడీపీ-జనసేన పార్టీలపై తరచు విరుచుకుపడే అంబటి తాజాగా జనసేన జెండా ఎన్టీఆర్ భవన్‌కి… తెలుగుదేశం జెండా గాంధీ భవన్‌కి అంటూ ఎక్స్ ప్లాట్ ఫాంలో కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.