దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ బహిరంగ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాశారు. రాముడి ధర్మ మార్గానికి ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. నక్సలిజం, మావోయిస్ట్ ఉగ్రవాదంపై సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ, ఇది దేశం సాధించిన ప్రధాన విజయం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి దీపావళి సందర్భంగా బహిరంగ లేఖ రాశారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి దీపావళి సందర్భంగా బహిరంగ లేఖ రాశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానంతరం రెండవ దీపావళి జరుగుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. శ్రీరాముడు ధర్మం వైపు నిలబడి, అన్యాయంపై ధైర్యంగా పోరాడాలని బోధించారని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. రాముడి ధర్మ మార్గానికి ఆపరేషన్ సింధూర్ ఒక చక్కటి ఉదాహరణ అని మోదీ అన్నారు. దేశంలో నక్సలిజంపై విజయం సాధించినందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో నక్సలిజాన్ని, మావోయిస్ట్ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడం జరిగిందని ఆయన వివరించారు. దీని ఫలితంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో తొలిసారిగా దీపాలు వెలిగాయని, అభివృద్ధి మార్గం సుగమమైందని మోదీ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిల్లర దొంగ చేతివాటం
దీపకాంతుల్లో అయోధ్య.. రెండు గిన్నిస్ రికార్డులు
ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం
