అసలు సైకో బాలకృష్ణ.. వీడియో వైరల్
మాజీ మంత్రి పేర్ని నాని, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలకృష్ణ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి, జగన్ మధ్య సోదర బంధం ఉందని, చిరంజీవి లేఖను వైసీపీ స్వాగతిస్తుందని నాని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ సమస్యలు, బాలకృష్ణ ద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ "అసలు సైకో ఎవరు?" అని నిలదీశారు.
మాజీ మంత్రి పేర్ని నాని, బాలకృష్ణ , కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమానంగా ఉండటాన్ని బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవి మధ్య సోదర భావం ఉందని, చిరంజీవి ఈ లేఖను చాలాకాలం క్రితమే రాయాల్సి ఉండేదని అన్నారు. ఇప్పటికైనా చిరంజీవి లేఖ రాయడాన్ని వైసీపీ స్వాగతిస్తుందని ఆయన తెలిపారు. బాలకృష్ణకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే పడదని, అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారని ఆరోపించారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
