చిన్నపిల్లల తల్లులకు వైద్యుల వార్నింగ్
ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. ముఖ్యంగా చిన్న పిల్లలు తల్లులు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వార్త వినండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఆ.. ఏమీ కాదులే అని అలసత్వం వహించినా మీ కంటి పాపకు మీ చేజేతులారా కష్టాలు కొని తెచ్చిపెట్టినట్లే అవుతుంది. యస్.. ఇంట్లో పసి పిల్లలకు కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా మెడికల్ షాప్‌కు వెళ్లడం..
ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. ముఖ్యంగా చిన్న పిల్లలు తల్లులు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వార్త వినండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఆ.. ఏమీ కాదులే అని అలసత్వం వహించినా మీ కంటి పాపకు మీ చేజేతులారా కష్టాలు కొని తెచ్చిపెట్టినట్లే అవుతుంది. యస్.. ఇంట్లో పసి పిల్లలకు కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా మెడికల్ షాప్‌కు వెళ్లడం ఏదో యాంటిబయాటిక్స్ గోలీలు తెచ్చి మింగించడం వంటివి చేస్తే.. ఇక నుంచి మానుకోండి. లేదంటే తీవ్ర ఆరోగ్యపరమైన పరిణామాలు ఉంటాయిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు అత్యంత శక్తిమంతమైన ఔషధాలు. అయితే వాటిని అవసరం లేకున్నా వినియోగిస్తే, అదీ పసివయసులో వాడితే… చిన్నారులు ఆస్తమా బారినపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతుంది? దాని ప్రభావం భవిష్యత్ జీవితంపై ఎలా ఉంటుందనే కోణంలో ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సంచలన విషయాలు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2.60 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో పిల్లల్లో ఆస్తమా రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్