ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్.. ఆ తర్వాత
విజయవాడ జగ్గయ్యపేటలో సహజీవనం చేస్తున్న ప్రవళిక కొత్త ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పేరు మార్పుపై ప్రియుడితో గొడవ పడటమే కారణమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని, ఆస్తి వివాదం కారణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాదిగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. ఎంతో ప్రేమగా ప్రియురాలి పేరు మీదే ఫ్లాట్ కొనుగోలు చేసిన ప్రియుడు.. రిజిస్ట్రేషన్ టైముకి ఆ ప్రేమను కాస్తా తల్లి మీదకు మళ్లించాడు. ఫ్లాట్ ను తల్లి పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలిసి ప్రియురాలు నిలదీసింది. చివరికి కొత్త ఇంట్లోకి వెళ్లగానే ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విజయవాడలోని జగ్గయ్యపేటలో జరిగింది. జగ్గయ్యపేట కు చెందిన ప్రవళిక, షేర్ మహమ్మద్ పేటకు చెందిన చలమల సుభాష్ చంద్రబోస్.. ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట శాంతినగర్ లో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటిని ప్రవళిక పేరుతో అగ్రిమెంట్ చేసిన సుభాష్ రిజిస్ట్రేషన్ మాత్రం తన తల్లి పేరు మీద చేయించాడు. ఈ విషయం ప్రవళికకు తెలియడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రవళిక కొత్త ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొత్త ఇంటి విషయమై జరిగిన గొడవే విషాదానికి దారి తీసింది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.. ఘటనా స్థలంలో క్లూస్ సేకరించిన పోలీసులు ప్రాథమికంగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. కొత్త ఇంటి విషయంలో జరిగిన వివాదంలో సుభాష్ కుటుంబ సభ్యులు ప్రవళికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. కేవలం కొత్త ఇంటి కోసమే ప్రవళికను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో స్థానిక పోలీసులు నిరాశ పరుస్తున్నారని కూడా కుటుంబ సభ్యులు వాపోయారు. నిష్పక్షపాతంగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పరిసరాల్లోని సిసి ఫుటేజ్.. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
టీ20 వరల్డ్‌కప్ 2026.. గిల్‌కు షాక్.. అక్షర్‌కు ప్రమోషన్!
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

