ఆలయంలో నంది విగ్రహం చోరీ వీడియో
శ్రీ సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల శివాలయంలో సెప్టెంబర్ 12న రాయలకాలం నాటి నంది విగ్రహం చోరీకి గురైంది. విగ్రహంలో వజ్రాలున్నాయనే ప్రచారంతో కొందరు దుండగులు దీనిని అపహరించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించారు.
శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లి మండలం ముష్టి కోవెలలోని శివాలయంలో ఒక నంది విగ్రహం చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నంది విగ్రహంలో వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం స్థానికంగా జరగడంతో, కొందరు దుండగులు దానిని అపహరించారు. సెప్టెంబర్ 12న పక్కా ప్రణాళికతో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు, నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నంది విగ్రహం కృష్ణదేవరాయుల కాలం నాటిది. రాయల కాలంలో వజ్రవైఢూర్యాలు పుష్కలంగా ఉండేవని, అందువల్ల ఈ విగ్రహంలోనూ వజ్రాలు ఉండవచ్చనే నమ్మకంతో దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
