ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
టిబెట్ ఆకాశంలో ఇటీవల కనిపించిన ఎర్రటి కాంతి స్తంభాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసి చాలామంది ఆత్మలు లేదా గ్రహాంతరవాసుల ప్రభావమని భావించినా, శాస్త్రవేత్తలు ఇవి ‘రెడ్ స్ప్రైట్స్’ అనే అరుదైన వాతావరణ విద్యుత్ ఘటనలని తెలిపారు. భారీ మెరుపుల ప్రభావంతో భూమికి 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే ఈ కాంతి దృశ్యాలు ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.
ఆకాశంలో ఒక్కసారిగా ఎర్రటి కాంతి స్తంభాలు ప్రత్యక్షమై క్షణాల్లో మాయమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎక్కోడ ఒక చోట వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆకాశంలో జరిగే ప్రతి కదలిక మనుషులకు ఆశ్చర్యంగా కనిపించి ఆసక్తిని పెంచుతూంటాయి. తాజాగా టిబెట్ ఆకాశంలో విచిత్రమైన కాంతి రేఖలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టిబెట్ లోని షనాన్ ప్రాంతంలో ఇటీవల ఉరుములతో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో రికార్డ్ చేసిన ఒక వీడియోలో ఆకాశంలో ఒక్కసారిగా ఎర్రటి ఆత్మల మాదిరి వింత మెరుపు ఆకారాలు కనిపించాయి. భారీ ఎరుపు రంగు కాంతి స్తంభాలు ఒక్కసారిగా మెరిసి మాయమయ్యాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యాన్ని తలపించిన ఆ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. శాస్త్రీయంగా ఈ అద్భతం వెనక దాగిన రహస్యం ఏంటో చూద్దాం. భారీ ఆకారంలో ప్రత్యక్షమై క్షణాల్లో మాయమైన ఎత్తైన దీప స్తంభాల్లాంటి కాంతిపుంజాలను కొందరు తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అవి ఏ ఆత్మలో,ఏలియన్సో కావని వాటిని ‘రెడ్ స్ప్రైట్స్’ అని పిలుస్తారని సైంటిస్టులు స్పష్టత ఇచ్చారు. మనం సాధారణంగా చూసే మెరుపులు మేఘాల లోపల లేదా మేఘాల నుంచి భూమికి వస్తాయి. కానీ ఈ ‘రెడ్ స్ప్రైట్స్’ అలా కావు. అవి మేఘాలకు చాలా పైన, అంటే భూ ఉపరితలానికి దాదాపు 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాతావరణ ఎగువ పొరలలో సంభవిస్తాయి. శాస్త్రవేత్తలు వీటిని ‘ట్రాన్సియెంట్ లూమినస్ ఈవెంట్స్’ గా వర్గీకరిస్తారు. భూమిపై పడే శక్తివంతమైన మెరుపుల వల్ల వాతావరణం పై పొరల్లో బలమైన విద్యుత్ క్షేత్రాలు ఏర్పడతాయి, ఆ విద్యుత్ క్షేత్రాల ప్రభావంతో అక్కడి నైట్రోజన్ అణువులు ఉత్తేజితమై అలాంటి ఎరుపు రంగు కాంతిని విడుదల చేస్తాయని అంటున్నారు. అవి జెల్లీఫిష్, క్యారెట్, లేదా పెద్ద కాంతి స్తంభాల ఆకారాల్లో కనిపిస్తుంటాయని వివరిస్తున్నారు. మొత్తంగా టిబెట్ భూభాగంలో కనిపించిన రెడ్ స్పైట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు

