AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

Phani CH
|

Updated on: Jun 22, 2026 | 9:02 PM

Share

బెంగుళూరులో మొబైల్ దొంగతనం ప్రయత్నం ఊహించని విషాదానికి దారితీసింది. న్యాయవాది ఫోన్ లాక్కొని పారిపోతున్న ఇద్దరు దొంగలను ఓ కూలీ సమయస్ఫూర్తితో అడ్డుకున్నాడు. దీంతో పరారైన నిందితుల్లో 18 ఏళ్ల జునైద్ కొద్దిసేపటికే ఛాతినొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఒక మొబైల్ దొంగతనం ఉదంతం ఊహించని విషాదంతో ముగిసింది. బెంగుళూరులోని కబ్బన్‌పేటలో ఒక న్యాయవాది రోడ్డుపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన ఫోన్‌ను గుంజుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. బాధితుడు ‘దొంగ.. దొంగ’ అని అరవడంతో.. అటుగా సరుకుల మూట తలపై పెట్టుకొని వెళ్తున్న స్థానిక వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి తన తలపై ఉన్న బరువైన సరుకుల మూటను వేగంగా వస్తున్న వారి బైక్‌ పైకి విసిరాడు. సరుకుల మూట దెబ్బకు బైక్ పై నుంచి వారు కిందపడ్డారు. వెంటనే ఆ దొంగలు వాహనాన్ని, ఫోన్‌ను అక్కడే వదిలేసి పరుగు తీశారు. అలా ఒక 250 మీటర్లు పరిగెత్తారో లేదో.. అందులో జునైద్ అనే 18 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఛాతి నొప్పితో ఫుట్‌పాత్‌పై కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దొరికిపోతామనే తీవ్రమైన భయం, ఒత్తిడితో పరిగెత్తడం వల్లే అతడికి గుండెపోటు వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విచారణలో మృతుడికి గతంలోనే గుండె జబ్బు ఉందని, స్టెంట్ కూడా వేసినట్లు అతని తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. జునైద్ మొదటిసారి దొంగతనానికి పాల్పడగా.. అతనితో ఉన్న పాత నేరస్తుడు అర్బాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కూలీ సమయస్ఫూర్తి, దొంగలు పారిపోవడం, నిందితుడు కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..

టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

Follow Us