Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

సముద్ర మట్టానికి 7.6 కి. మీ ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఉందని తెలిపారు. ముఖ్యంగా జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన...

Updated on: Jul 27, 2024 | 1:44 PM

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే హైదారాబాద్ వాతావరణ శాఖ మరోసారి అలర్ట్‌ చేసింది. ఉత్తర బంగాళాఖాతం,  గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

సముద్ర మట్టానికి 7.6 కి. మీ ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఉందని తెలిపారు. ముఖ్యంగా జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ప్రాంతాల్లో ఈదురు గాలుతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 5.76 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us