Sankranti 2026: మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలంటే..
సంబరాల సంక్రాంతి త్వరలో వస్తోంది! ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, కొత్త బట్టలతో పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకుంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మకర సంక్రాంతి 2026 జనవరి 15న జరుపుకుంటారు. సూర్యుని పూజించి, నువ్వుల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి, పొంగలి వండి శుభాలు కోరుకుంటారు. ఈ పండుగ సంస్కృతి, సంప్రదాయాల కలయిక.
సంబరాల సంక్రాంతి త్వరలో వస్తోంది. ప్రతి ఇంటిముందు తీర్చిదిద్దిన ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, రంగు రంగుల పువ్వులు, రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు. అబ్బో చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి సరేసరి. అప్పుడే పండి ఇంటికి వచ్చిన వరి ధాన్యంతో చేసిన అరిసెలు, బూరెలు, గారెలు, మురుకులు, పాయసం, పులిహోర ఆహా ఏమి రుచిగా ఉంటాయో కదా. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో అయితే చెప్పక్కర్లేదు. ట్టణాల్లో కూడా తక్కువేం కాదు! పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యాకాలంలో సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టడమే మకర సంక్రాంతి పండుగ. ప్రతి ఏడాది ఇతర పండగలు తేదీలు మారతాయి కానీ సంక్రాంతి పండుగ మాత్రం జనవరి 14 లేదా 15 తేదీల్లోనే వస్తుంది. కొత్త ఏడాది 2026లో కూడా జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ జరుపుకోనున్నారు. ఈ సంక్రాంతి నెల చాలా పవిత్రమైందని.. స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి రోజున సూర్యుడిని పూజించాలి. నువ్వులతో చేసిన పిండి వంటలు అరిసెలు, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ఈ రోజున చాలా మంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. కొత్త కుండలో ఆవు పాలు పొంగిస్తే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఏడాది అంతా సంతోషం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. పాలు పొంగిన కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం, చెరకు రసం వంటివి వేసి పొంగలి వండుతారు. సంక్రాంతి రోజు ప్రతి ఇంట్లో కనిపించే సంప్రదాయపు సంతోషాల పొంగు ఈ పొంగలి కుండ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో మనోళ్లకు ఉద్యోగాలు
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది.. మ్యాటర్ ఏంటంటే..
Gold Price Today: ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా?