అయోధ్యలో రాముడి విగ్రహం ఊరేగింపు రద్దు

|

Jan 11, 2024 | 9:33 PM

రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి వారం రోజుల ముందు నుంచే సందడి ఉంటుంది. సంప్రదాయబద్దంగా అప్పుడు చేయాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు వారం రోజులపాటు కొనసాగుతాయి.

రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి వారం రోజుల ముందు నుంచే సందడి ఉంటుంది. సంప్రదాయబద్దంగా అప్పుడు చేయాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు వారం రోజులపాటు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే విడుదల చేసింది. అయితే తాజాగా అందులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి 17న నిర్వహించ తలపెట్టిన బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య విగ్రహ ఊరేగింపు రద్దయింది. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాశ్మీర్‌కు ఏమైంది ?? గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!

అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!

ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..

అమెరికా వైట్‌ హౌస్‌ గేటును ఢీకొట్టిన కారు..

పండక్కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలోకి నితిన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ??

Follow us on