AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kritisanon: కెరీర్‌ను రివ్యూ చేసుకున్న కృతి సనన్

Kritisanon: కెరీర్‌ను రివ్యూ చేసుకున్న కృతి సనన్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 02, 2026 | 8:21 PM

Share

నటి కృతి సనన్ తన కెరీర్ ప్రయాణం గురించి పంచుకున్నారు. సినిమా రంగంలో గుర్తింపు కోసం పడే ఒత్తిడి, విజయాలను నిలబెట్టుకోవడం, ఎదుగుదల వంటి దశలలో ఒత్తిడి తప్పదని ఆమె అన్నారు. విమర్శలను ఎదుర్కోవడం ఒక గొప్ప కళ అని, వాటిని దాటుకున్నప్పుడే మనలోని శక్తి తెలుస్తుందని కృతి స్పష్టం చేశారు. ఆమె ఈ పాఠాలతో నిర్మాతగానూ దూసుకుపోవాలని కలలు కంటున్నారు.

కెరీర్‌లో కాస్త నిలదొక్కుకున్నాక గమనిస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. నడిచొచ్చిన ఎత్తు పల్లాలు కొన్నిసార్లు నిట్టూర్పులు తెప్పిస్తే, మరికొన్ని సార్లు కాలర్‌ ఎగరేయమని సిగ్నల్స్ పంపిస్తుంటాయి. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా నా లైఫ్‌లోనూ ఇలాగే జరిగిందంటున్నారు కృతి సనన్‌. ఇంతకీ ఈ లేడీ ఏమన్నారు? కృతిసనన్‌ అనే పేరు.. గ్లామర్‌ ఇండస్ట్రీలో జస్ట్ అనదర్‌ నేమ్‌ అయితే కాదు. ఆమె సినిమాల సెలక్షన్‌ మీద ఓ గురి ఉంది జనాలకు. మంచి సబ్జెక్టులతో నిర్మాతగానూ దూసుకుపోవాలని కలగంటున్నారు ఈ లేడీ. అయితే కెరీర్‌ స్టార్టింగ్‌లో ఉన్న కలలకు, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నది కృతిసనన్‌ అబ్జర్వేషన్‌. అర్జంటుగా గుర్తింపు తెచ్చేసుకోవాలనే ఆందోళన కెరీర్‌ బిగినింగ్‌లో ఎక్కువగా ఉండేదంటారు కృతి. సినిమా రంగంలో స్ట్రెస్‌ అంటూ లేనివారే ఉండరన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్‌మెంట్‌. మంచి అవకాశాలు తెచ్చుకునేవరకూ ఓ రకమైన టెన్షన్‌ ఉంటే, ఆ తర్వాత సక్సెస్‌ రావడానికీ, వచ్చిన సక్సెస్‌ని నిలబెట్టుకోవడానికి, ఇంకో స్టెప్‌ ఎదగడానికీ.. ఇలా అన్ని స్టేజీల్లోనూ స్ట్రెస్‌ ఉంటుందని చెప్పారు. కెరీర్‌ పరమైన స్ట్రెస్‌ ఓ రకంగా ఉంటే, సొసైటీ పరంగా మరో రకమైన స్ట్రెస్‌ ఉంటుందని, తాను చాలా ఫేస్‌ చేశాననీ చెబుతున్నారీ లేడీ. నవ్వితే చిగుళ్లు కనిపిస్తున్నాయని కూడా తన గురించి కామెంట్‌ చేసిన వాళ్లున్నారన్నారు. విమర్శల్ని జస్ట్ ఇగ్నోర్‌ చేసుకుంటూ ముందుకు సాగడం చాలా గొప్ప కళ. అయితే అది అనుభవం మీద వస్తుందిగానీ, మొదట్లో ఎవరికీ సాధ్యం కాదన్నది కృతి చెబుతున్న మాట. విమర్శలను దాటుకుని ముందుకు వెళ్లినప్పుడే మనలో ఉన్న సూపర్‌ పవర్‌ అర్థమవుతుందని చెబుతున్నారు కృతి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Follow Us