Health: గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?

| Edited By: Ravi Kiran

Mar 03, 2024 | 11:00 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవించొచ్చు కానీ, నీరు లేకపోతే మాత్రం జీవించడం కష్టమని నిపుణులు చెబుతుంటారు. అంతలా మనిషి ఆరోగ్యంపై మంచి నీరు ప్రభావం ఉంటుంది. ప్రతీ రోజూ కచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. శరీరంలో సరిపడ నీరు లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవించొచ్చు కానీ, నీరు లేకపోతే మాత్రం జీవించడం కష్టమని నిపుణులు చెబుతుంటారు. అంతలా మనిషి ఆరోగ్యంపై మంచి నీరు ప్రభావం ఉంటుంది. ప్రతీ రోజూ కచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. శరీరంలో సరిపడ నీరు లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. డీహైడ్రేషన్‌ కారణంగా శరీరంలోని కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని కారణంగా కడుపుతో పాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. మెదడు పనితీరుపై కూడా దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే నీరు తాగడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అధికంగా తాగితే అంతే నష్టం చేస్తుందని మీకు తెలుసా.? ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా నీరు తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. సోడియం, పొటాషియంతో పాటు మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ శరీరంలో సమతుల్యంగా ఉంటేనే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. అయితే అధికంగా నీరు తాగితే.. ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బ తింటుంది. కాల క్రమేణ ఇది గుండె పంపింగ్‌లో ఆటంకాలు, ధమనులలో బలహీనతకు దారి తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న రోగులు ఎక్కువ నీరు తాగితే వారి గుండె చప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలున్న వారు ప్రతి రోజూ 2 లీటర్లకంటే ఎక్కువ నీరు తాగకూడదని సూచిస్తున్నారు. అలాగే డైట్‌లో ఏదైనా లిక్విడ్‌ని భాగం చేసుకుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us on