ఇకపై పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కంటే ముందే ఆధార్ కార్డ్.. ఎలా ఇస్తారంటే ?? వీడియో
ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డులను అందజేసేందుకు ఆధార్ కార్డు తయారీ సంస్థ యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఆసుపత్రుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించనున్నారు.
ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డులను అందజేసేందుకు ఆధార్ కార్డు తయారీ సంస్థ యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఆసుపత్రుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పిల్లల బర్త్ సర్టిఫికెట్‌కంటే ముందే వారికి ఆధార్ కార్డు వచ్చేస్తుంది. నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇవ్వడానికి తాము బర్త్ రిజిస్ట్రార్‌తో టైఅప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని యూడీఐఏఐ సిఈవో సౌరభ్ గార్గ్ తెలిపారు. ఇప్పటికే వయోజన జనాభాలో 99.7 శాతం మంది ఆధార్ పరిధిలోకి వచ్చారని గార్గ్ చెప్పారు. ఇప్పుడు నవజాత శిశువులను ఆధార్ ప్రక్రియలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బిడ్డ పుట్టినప్పుడు బేబి ఫోటోను క్లిక్ చేయడం ద్వారా ఆధార్ కార్డు ఇస్తామనీ గార్గ్ వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో
Viral Video: వాటెన్ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో