Viral Video: వాటెన్ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో
సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనం అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొందరు పోస్ట్ చేసే వీడియోలు భలే నవ్వు తెప్పిస్తాయి.. అంతేకాదు ఆలోచింపచేస్తాయి కూడా.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనం అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొందరు పోస్ట్ చేసే వీడియోలు భలే నవ్వు తెప్పిస్తాయి.. అంతేకాదు ఆలోచింపచేస్తాయి కూడా. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టంట బాగా ట్రెండవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడి తెలివి సల్లగుండ.. అనీ పీత తెలివి తేటలు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి. మనం బాల్కనీలలో తాళ్లపైన బట్టలు ఆరేస్తుంటాం. గాలికి ఎగిరిపోకుండా వాటికి క్లిప్పులు కూడా పెడతాం. అయినా ఒక్కోసారి బట్టలు ఎగిరిపోతుంటాయి. అలా చైనాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్లాట్‌లో బాల్కనీ నుంచి ఓ షర్ట్ పడిపోయింది. పై అంతస్తునుంచి పడిన ఆ షర్ట్ నేలపై పడి ఉంటే… కిందకి వెళ్లి తెచ్చుకునేవాళ్లు. కానీ అది మధ్యలో ఉన్న సన్‌షేడ్‌పై పడింది. దాంతో ఆ షర్ట్‌ని ఎలా తీసుకోవాలో వారికి అర్థం కాలేదు. సమయానికి వాళ్లదగ్గర పొడవాటి కర్ర కూడా లేదు. దాంతో వాళ్లకి ఓ ఐడియా వచ్చింది. ఆరోజు వాళ్లు భోజనంలోకి కూరకోసమని తెచ్చుకున్న పీతలు ఉన్నాయి. వాటిలో బతికి ఉన్న ఓ పీతను తీసుకొచ్చి.. దానికి ఓ తాడు కట్టి సన్ షేడ్ పైకి మెల్లగా దింపారు. అది కరెక్టుగా వెళ్లి షర్టుపై వాలింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో
ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో
వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

