White Sugar effects: తెల్ల చక్కెర.. వెరీ డేంజరస్.. పిల్లల్లకు అయితే మరి డేంజర్.. జాగ్రత్త సుమీ..(వీడియో).

|

Sep 05, 2021 | 6:13 PM

వైట్‌ షుగర్‌ ఎక్కువగా వాడుతున్నారా... జాగ్రత్త.. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదముంది. ముఖ్యంగా పిల్లల్లో డిప్రెషన్‌ పెంచుతుంది.. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఈ తెల్ల చక్కెరను 'స్వీట్‌ పాయిజన్‌'గా అభివర్ణించారు.

వైట్‌ షుగర్‌ ఎక్కువగా వాడుతున్నారా… జాగ్రత్త.. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదముంది. ముఖ్యంగా పిల్లల్లో డిప్రెషన్‌ పెంచుతుంది.. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఈ తెల్ల చక్కెరను ‘స్వీట్‌ పాయిజన్‌’గా అభివర్ణించారు. ఎందుకంటే ఇది ప్రాసెస్‌ చేసిన తర్వాత వచ్చే పదార్థం. దీనిలో అనేక రకాల రసాయనాలు కలిసి వుంటాయి. అందువల్ల వైద్యులు దీనిని ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు.

సాధారణంగా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా స్వీట్స్‌ తయారుచేయడం అందరికీ అలవాటు. ఇక పండగలు, పర్వదినాలప్పుడు స్వీట్స్‌ కంపల్సరీ. ఈ క్రమంలో స్వీట్స్‌ తయాచు చేసేందుకు వైట్‌ షుగర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. ఈ తెల్ల చక్కెర ప్రాసెస్ చేసిన తర్వాత బయటకు వచ్చిన పదార్థం. ఇందులో అనేక రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. అందువల్ల వైద్య నిపుణులు దీనిని చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. శీతల పానీయాలు, చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్స్‌ ఇలా అన్నింటిలో ఎక్కువగా వాడేది తెల్ల చక్కెరే. వీటికి పిల్లలను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌ బాధితులుగా మారే ప్రమాదముంది.

చెరకు నుంచే తెల్ల చక్కెర తయారవుతుంది కానీ అది అనేక రకాల రసాయన ప్రక్రియల ద్వారా చక్కెరగా మారుతుంది. తెల్లదనం కారణంగా ఇది అందరికీ నచ్చుతుంది కానీ.. ఇందులో మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు ఉండవు. తెల్ల చక్కెర వాడటం వల్ల పిల్లల దంతాలు దెబ్బతింటాయి. తెల్ల చక్కెర పిల్లల బరువును కూడా పెంచుతుంది. ఇందులో ఉండే రసాయనాలు, కార్బోహైడ్రేట్ల కారణంగా పిల్లలపై చెడు ప్రభావం అధికంగా పడుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Bheemla Nayak Song: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు(వీడియో)

Solar Storm: భూమికి త్వరలో ముప్పు.. అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు(వీడియో).

Tokyo Paralympics video: అంగవైకల్యం అతని ముందు తలొంచింది.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు..(వీడియో)

Viral Video: దక్షిణ ఆస్ట్రేలియాలో అద్భుత లోకం..! ఇది గ్రాఫిక్స్‌ కానే కాదు.. సరస్సు వీడియో…