Diwali Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న ప్రత్యేక రైళ్లు..(వీడియో)
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది.
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. విశాఖపట్నం –సికింద్రాబాద్, విశాఖపట్నం–తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వే శాఖ ప్రారంభించింది. నవంబరు 2న సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరనున్న 08585 నెంబరుగల ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 07 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే నవంబరు 3న రాత్రి 09 గంటల 05 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న 08586 నెంబరు గల ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 09 గంటల 50 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
అలాగే మరో ప్రత్యేక రైలు నెం.08583 నవంబరు 1న సాయంత్రం 07 గంటల 15 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడున్నర గంటలకు తిరుపతి చేరుకోనుంది. అలాగే మరో ప్రత్యేక రైలు నెం.08584 తిరుపతి నుండి నవంబరు 2న రాత్రి 09 గంటల 55 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..