Health: ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం.

Health: ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం.

Anil kumar poka

|

Updated on: Feb 16, 2024 | 4:09 PM

చాలా మందికి బెడ్‌పై కూర్చుని ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగినప్పటి నుంచి చాలామంది ఇంట్లో కూర్చుని ఇలానే వర్క్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ ఒడిలో ల్యాప్‌టాప్‌ పెట్టుకుని.. మంచం మీద అలా పనిచేయడం మీకు సౌకర్యంగా అనిపించవచ్చు.. కానీ దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

చాలా మందికి బెడ్‌పై కూర్చుని ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగినప్పటి నుంచి చాలామంది ఇంట్లో కూర్చుని ఇలానే వర్క్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ ఒడిలో ల్యాప్‌టాప్‌ పెట్టుకుని.. మంచం మీద అలా పనిచేయడం మీకు సౌకర్యంగా అనిపించవచ్చు.. కానీ దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్ నుండి వచ్చే వేడి గాలి చర్మంపై చికాకును కలిగిస్తుంది. దీనిని టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటారు. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల చర్మవ్యాధులు వస్తాయి. అంతేకాదు, మీ ఒడిలో ల్యాప్‌టాప్‌తో పని చేయడం పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ల్యాప్‌టాప్‌ల నుండి వచ్చే వేడి గాలి స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గిస్తుంది. లాప్‌టాప్‌ వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను అందుకుంటుంది, అనేక ఫ్రీక్వెన్సీలలో EMFలను విడుదల చేస్తుంది. దాంతో స్పెర్మ్ కణాల DNA దెబ్బతింటుందని అర్జెంటీనాలో నిర్వహించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ల్యాప్‌టాప్‌ను కాళ్లపై పెట్టుకుని వాడితే.. దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చర్మం దెబ్బతింటుందని, ఇది స్కిన్‌ క్యాన్సర్‌ ముప్పును పెంచుతుందని యూనివర్శిటీ హాస్పిటల్ బాసెల్‌కు చెందిన స్విస్ పరిశోధకులు, ఆండ్రియాస్ ఆర్నాల్డ్ వెల్లడించారు.

అలానే మహిళలలో ఎగ్‌ రిలీజ్‌ సమక్రమంగా జరగదు. ఒడిలో ల్యాప్‌టాప్‌ని పెట్టుకుని.. మంచంపై అలా వాలి ఎక్కువసేపు పని చేయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకున్నారంటే.. నిటారుగా కూర్చోవడం సాధ్యం కాదు.. వంగి లేదా వాలి కూర్చోవాల్సి వస్తుంది. దీంతో వెన్నుముకపై ఒత్తిడి పడి.. నొప్పికి దారి తీస్తుంది. అలానే మెడపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పని చేయడం మంచిది. అలానే కంటి సంరక్షణ కోసం, ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..